Wednesday, July 1, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీ సేవలు ప్రశంసనీయం

రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీ సేవలు ప్రశంసనీయం

📰 Generate e-Paper Clip

రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీ సేవలు ప్రశంసనీయం

 

సమాచార శాఖ ఉప సంచాలకులు కె. జయమ్మ

 

కర్నూలు ప్రతినిధి, జూన్ 30, (సీమకిరణం న్యూస్) :

 

ప్రభుత్వ సేవలో నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీతో నాలుగు దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించిన రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీ సేవలు సమాచార ప్రశంసనీయమని సమాచార శాఖ ఉప సంచాలకులు కె. జయమ్మ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కర్నూలులోని సమాచార శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో పదవీ విరమణ పొందిన రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీకి శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సంచాలకులు కె. జయమ్మతో పాటు శాఖ అధికారులు, సిబ్బంది పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సంచాలకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా సుమారు 40 సంవత్సరాల పాటు అబ్దుల్ నబీ ఎంతో అంకితభావంతో విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఉద్యోగ జీవితమంతా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో పనిచేస్తూ శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని అన్నారు. అప్పగించిన ప్రతి పనిని సమయపాలనతో పూర్తి చేస్తూ అధికారుల విశ్వాసాన్ని, సహోద్యోగుల అభిమానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగం అనేది కేవలం విధుల నిర్వహణ మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అని అబ్దుల్ నబీ తన సేవల ద్వారా నిరూపించారని తెలిపారు. తన మృదుస్వభావం, వినయం, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి సద్గుణాలతో అందరి మన్ననలు పొందారని అన్నారు. కొత్తగా చేరిన సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తూ, కార్యాలయ పనుల్లో సహకరిస్తూ ఆదర్శ ఉద్యోగిగా నిలిచారని కొనియాడారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమైన ఘట్టమని, అయితే సేవల ద్వారా సంపాదించిన గౌరవం, మంచి పేరు శాశ్వతంగా నిలిచిపోతాయని ఉప సంచాలకులు పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం అబ్దుల్ నబీ కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. అనంతరం శాఖ అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా అబ్దుల్ నభిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయన భావి జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ దివాకర్ రావు, డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సందీప్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఫర్జానా, కార్యాలయ సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular