Thursday, April 9, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత

బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత

📰 Generate e-Paper Clip

బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత

 

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రచార రథం

 

 మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్

 

ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాలలో బాల్య వివాహాలు, కౌమార గర్భ నిరోధానికి “ప్రచార రథం” ప్రదర్శనలు

 

 వెల్దుర్తి, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్ ) :

 

బాల్య వివాహాల నియంత్రణ మన అందరి బాధ్యత అని మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నారు. కర్నూలు జిల్లా, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాలలో, కౌమార గర్భాలు మరియు బాల్య వివాహాల నివారణకు “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” ద్వారా కళాజాత ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వెల్దుర్తి సచివాలయ 2 పరిధిలో సీతారాముల వారి గుడి దగ్గర “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” కళాజాత బృందాలు పాటలు, నాటికలు, నినాదాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాయి. నాగన్ననేతృత్వంలో కళాజాత బృందం ఆధ్వర్యంలో , బాల్య వివాహాలు మరియు కౌమార గర్భాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి టిడిపి నాయకుడు ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు జిల్లా కౌమార గర్భాల విషయంలో రెండవ స్థానం ఉంది వెల్దుర్తి మండలంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి ప్రజలు నివసించే గ్రామాలపై దృష్టి ఎక్కువ ఉండాలని కళాబృందాన్ని కోరారు. అదేవిధంగా బాల్య వివాహాలు జరుగుతే జరగబోయే సమస్యల గురించి బాలికలకి వివరంగా తెలిపారు. వెల్దుర్తి ప్రాజెక్ట్ ఐసిడిఎస్ లుక్ సర్ మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకోవడంలో మాటకంటే పాట ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఆటపాటల ద్వారా చైతన్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ప్రచార రథం ద్వారా “బేటీ బచావో బేటీ పడావో” పాటు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడంతో కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ వెల్దుర్తిప్రాజెక్ట్ సూపర్వైజర్ పద్మావతి,సరస్వతి,శ్రీదేవి, సుగుణ, సునీత,ఐసిపిఎస్ దీప రాణి,కళాబృందం నాగేశ్వరావు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు బాలికలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular