అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పాకిస్థాన్ అంటేనే ఎప్పుడూ అంతర్గత కలహాలు, సంక్షోభం, ఉగ్రవాదం, పేదరికం, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత.. ఇతర కారణాలతో నిండి ఉంటుంది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా పాకిస్థాన్ మారుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రిజం ఇండెక్స్ లో పాకిస్థాన్ తొలి స్థానంలో నిలిచింది. ఇక దాడి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో తొలిసారిగా పాకిస్థాన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు 6 శాతం పెరిగిన నేపథ్యంలో ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్- 2026లో పాకిస్థాన్ తొలి స్థానానికి ఎగబాకింది. ఈ నివేదికను ఇన్ డిగ్రీ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్(IEP) ప్రచురించింది. ఇక పాకిస్థాన్ లో 1,32 మరణాలు నమోదయ్యాయి. దాంతో ఆ దేశంలో భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 163 దేశాల్లోని పరిస్థితులను స్టడీ చేసింది. పాకిస్థాన్.. తన సరిహద్దు దేశాలతో కొనసాగుతున్న సంబంధాలనూ పరిగణలోకి తీసుకుంది. ఆఫ్గానిస్తాన్‌తోపాటుగా తెహ్రీక్- ఐ- తాలిబాన్ పాకిస్థాన్ మరియు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి ఉగ్రవాద సంస్థ నుంచి ప్రపంచ దేశాలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురైనట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఈ పరిశోధనలో పాకిస్థాన్ లో ఉగ్రవాదం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2013 నుంచి పెరుగుతోంది. ఈ మేరకు 2025లో 1,139 ఉగ్రవాద మరణాలు, 1,045 ఉగ్రవాద ఘటనలు జరిగాయి.
ఇక పాకిస్థాన్ లో తెహ్రీక్- ఐ- తాలిబాన్ పాకిస్థాన్(TTP) అత్యంత ప్రమాదకరమైన టెర్రర్ గ్రూప్ గా పేరుగాంచింది. అలాగే ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రమాదకర గ్రూప్ గా నిలిచింది. 2009 నుంచి టీటీపీ ద్వారానే 67 తర్వాత దాడులు జరిగినట్లు వెల్లడైంది. నుంచి ఈ ఉగ్రవాద సంస్థ మరింత యాక్టివ్ గా పని చేస్తుందని తేలింది. ఈ దాడులు 25 శాతం పెరిగాయి. ఈ సంస్థ దాడులు ఎక్కువగా ఖైబర్ పంఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోనే జరిగాయి.

ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో పాకిస్థాన్ తొలిస్థానంలో నిలవగా బుర్కినా ఫాసో, నైజీరియా, నైగర్, మాలి, సిరియా, సోమాలియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కొలంబియా, ఇజ్రాయెల్ తర్వాత స్థానంలో నిలిచాయి.

