Sunday, March 22, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! | హైదరాబాద్ ప్రమాణాలకు మించి...

హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! | హైదరాబాద్ ప్రమాణాలకు మించి అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

హైదరాబాదును మించేలా అమరావతిని అభివృద్ధి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

గచ్చిబౌలిలో సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు

గచ్చిబౌలిలోని ఐ ఎస్ బి లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో చంద్రబాబు కృత్రిమ మేధ విస్తరణ లక్ష్యాల పైన ప్రసంగించారు. 1990ల తర్వాత ఇంటర్నెట్ ప్రారంభమైందని, 1995 నుండి నాలెడ్జ్ ఎకానమీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కంపెనీలను పెట్టడం కోసం ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ని కలిసినట్టుగా చంద్రబాబు ప్రకటించారు.

హైదరాబాద్ ప్రమాణాలకు మించి అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు

హైదరాబాద్ నగరానికి ఐటీ సంస్థలు, బడా విద్యాసంస్థలు తెచ్చా

హైదరాబాద్ లో ఆఫీసు పెట్టాలని తాను కోరగా, మొదట బిల్ గేట్స్ నిరాకరించారని, తాను చేసిన కృషి ఫలితంగా ఆ కాలంలో అది సాధ్యమైంది. ఐ ఎస్ బి, నల్సార్, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడంలో తాను సక్సెస్ అయ్యాను అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం 5000 ఎకరాలు సేకరించామని చెప్పారు. కేవలం 9 నెలల్లోనే కృష్ణానది తాగునీరు అందించినట్లు చెప్పారు.

1999 నుండి 2004 మధ్య హైదరాబాద్ నగరాభివృద్ధికి చంద్రబాబు కృషి

హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంలో తాను ఎంతో కృషి చేశానని, 1999 నుండి 2004 మధ్య హైదరాబాద్ నగరాభివృద్ధికి సహాయం చేశానన్నారు. జీనోమ్ వ్యాలీ ఏర్పాటులో తన కృషి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. అనేక కారణాలతో 2004 అధికారంలో కోల్పోయింది, ఆ తర్వాత మళ్లీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామన్నారు. ఇక 2014 నుండి 2019 వరకు ఏపీలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు చంద్రబాబు.

ఇప్పుడు ఏపీ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో

కేవలం అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెడితే ఎన్నికలలో గెలవలేము అనే గుణపాఠం 2019లో నేర్చుకున్నామన్నారు. 2019 2024 మధ్య ఏపీ అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం అనేక రంగాలలో అగ్రస్థానంలో ఉందని, ఏపీని అన్ని విధాలుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నం అన్నారు.

గ్రీన్ ఎనర్జీరంగంలో ”దక్షిణాదిలో మేమే నెంబర్‌వన్‌”

ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, అంతరిక్ష సాంకేతికతలు, డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా విస్తరిస్తున్నాయని వివరించారు. విద్యుత్ సమస్యలను అధిగమించి, మిగులు స్థాయికి తీసుకొచ్చామని, గ్రీన్ ఎనర్జీరంగంలో ”దక్షిణాదిలో మేమే నెంబర్‌వన్‌” అని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని విధాలుగా ఏపీని తీర్చిదిద్ది హైదరాబాద్ ను మించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular