ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన తీరు పై కనిపించింది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా వ్యవహరించారు. దీంతో, ఇక మహేష్ కు పార్టీ పరంగా అవకాశాలు కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తిరుపతి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా చేసారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే. టీడీపీలో నాయకులంతా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని.. ఎవరికీ వెసులుబాటు ఉండదని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

పార్టీ నేతలకు చంద్రబాబు క్లారిటీ
గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నారన్న సీఎం, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలని సరికాదని తేల్చిచెప్పారు. కాగా.. ఎమ్మెల్యే కార్యకర్తలకు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని. ప్రజల్లో ఉండే సుదీర్ఘ రాజకీయాలు చేయగలరని అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరే కాకుండా వివిధ విభాగాల్లో జిల్లాల్లో అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. లా అండ్ ఆర్డర్, కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్ లో నియోజకవర్గాల పనితీరుపైనా రివ్యూ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే నిర్ణయాలపై చర్చ జరిగింది. తక్కువ ఖర్చుతో పూర్తి చేసి తెచ్చే ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ప్రకటించారు. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం పెంచేలా పనిచేయాలని అధికారులను సీఎం నియమించారు.

