ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ విశాఖపట్నం వేగంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ సంస్థలు విశాఖపైన ఆసక్తి చూపడంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కోరనే విశాఖకు మెట్రోరైలు, సెమీ రింగ్ రోడ్డు, నగర విస్తరణ వంటి అనేక పనులు చేపడుతోంది. ఈ పరిణామాల మధ్య విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక శుభవార్తను చెప్పారు మంత్రి నారాయణ.
మెట్రో ప్రాజెక్ట్ లపై మంత్రి నారాయణ శుభవార్త
ఈ ప్రాజెక్టుకు ఉగాదికి ముందే రెండు మూడు రోజులలో కేంద్రం నుంచి అనుమతులు లభిస్తాయని ఆయన ఉన్నారు. ప్రస్తుత విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కేంద్ర పరిశీలనలో ఉందని, రైడర్స్ సంస్థ అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు. ఇది మరో రెండు నెలలలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ అధ్యయనం తర్వాత మెట్రో నిర్మాణం కోసం టెండర్లను కూడా త్వరలోనే పిలుస్తామని మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు.

మూడేళ్ళలో పూర్తి చేసే లక్ష్యంతో విశాఖ మెట్రో నిర్మాణం
పట్టణ గృహ నిర్మాణ శాఖ పై జరిగిన ప్రాంతీయ సదస్సులో ఈ కీలక పరిశీలన చేసిన మంత్రి నారాయణ, కేంద్రం నుంచి అనుమతులు లభిస్తాయి విశాఖ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ మెట్రోదశలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు 46.8 మూడు మార్గాన్ని నిర్మించనున్నారు.
డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ మెట్రో
మొత్తం ఈ ప్రాజెక్టులలో మూడు ప్రధాన కారిడార్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు ఒక కారిడార్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ గురుద్వారా వరకు రెండో కారిడార్, చిన్న వాల్తేరు నుండి తాటిచెట్లపాలెం వరకు మూడో కారిడార్.. ఇలా మూడు కారిడార్లను ఏర్పాటు చేసింది. డబల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు.
విశాఖ మెట్రో డి పి ఆర్ కు కేంద్ర అనుమతులు ఇస్తే పనులు మొదలు
మొత్తం 46.23 కిలోమీటర్ల మార్గంలో, 20.16 మేర మెట్రో రైలు మార్గం నిర్మాణం జరుగుతుంది. ఇది ప్రాజెక్టులో దాదాపు సగం దూరం డబుల్ డెక్కర్ వ్యవస్థలోనే ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విశాఖ మెట్రో డి పి ఆర్ కు కేంద్ర అనుమతులు ఇస్తే, ఆ తర్వాత టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
విజయవాడ మెట్రో సర్వే చేపట్టి డిపిఆర్ ను సిద్ధం చేసి మళ్లీ కేంద్రానికి
మరోవైపు విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. దీనికి త్వరలోనే సర్వే చేపట్టి డిపిఆర్ ను సిద్ధం చేసి మళ్లీ కేంద్రానికి ఆమోదం కోసం పంపుతారు. ఏది ఏమైనా ఏపీలో మెట్రో రైళ్ల వ్యవస్థ కోసం కేంద్రం సానుకూలంగా స్పందించడం ఏపీ పురోగతికి కారణమవుతుంది.

