Friday, March 13, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మొండి బకాయిదారుల ఆస్తులు జప్తు

మొండి బకాయిదారుల ఆస్తులు జప్తు

📰 Generate e-Paper Clip

ప్రతిరోజు మొండి బకాయిదారుల ఆస్తులు జప్తు

 

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

 

కల్లూరు, మార్చి 13, (సీమకిరణం న్యూస్):

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఇకపై దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రతిరోజు ఆస్తుల జప్తు ప్రక్రియ చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో రెవెన్యూ విభాగ సిబ్బంది, అడ్మిన్‌లతో నిర్వహించిన సమావేశంలో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్ష చేపట్టారు. ఆర్‌ఐలు, సచివాలయాల వారీగా వసూళ్ల పురోగతిపై సమీక్షించి, లక్ష్యాలను త్వరితగతిన సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. టాప్‌లో ఉన్న మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేయాలని, ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గొద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్వోలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular