మొండి బకాయిదారుల ఆస్తులు జప్తు
ప్రతిరోజు మొండి బకాయిదారుల ఆస్తులు జప్తు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కల్లూరు, మార్చి 13, (సీమకిరణం న్యూస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఇకపై దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రతిరోజు ఆస్తుల జప్తు ప్రక్రియ చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో రెవెన్యూ విభాగ సిబ్బంది, అడ్మిన్‌లతో నిర్వహించిన సమావేశంలో పన్ను...