Thursday, March 12, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణAP LPG Crisis: సంక్షోభంలో ఏపీ హోటల్స్-ఆ రోజు సెలవు-రాత్రి 10 వరకు..! | పెరుగుతున్న...

AP LPG Crisis: సంక్షోభంలో ఏపీ హోటల్స్-ఆ రోజు సెలవు-రాత్రి 10 వరకు..! | పెరుగుతున్న LPG ధరలకు వ్యతిరేకంగా AP హోటల్స్ పని వేళలను తగ్గించాయి, ‘సర్వైవల్ మోడ్’లో సోమవారాలు మూతపడతాయి

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఏపీలో ఎల్పీజీ కొరత (LPG Crisis)తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు పైకి ఎల్పీజీ కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో హోటల్స్‌కు (AP Hotels) గ్యాస్ కొరత చుక్కలు చూపుతోంది. దీంతో వారు ఆ భారాన్ని ఎవరిపై నెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చోట్ల టిఫిన్, భోజనం, ఇతర ఆహార పదార్ధాల రేట్లను పెంచుతున్నారు. ఇక్కడితో ఆగకుండా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను బంద్ చేయాలని నిర్ణయించారు. అలాగే వారంలో ఒకరోజు సెలవు తీసుకోవడం, రాత్రి 10 గంటల వరకు పనిచేయాలని నిర్ణయించారు.

కమర్షియల్ ఎల్పీజీ అందుబాటులో లేకుండా పోతుందన్న భయాల నేపథ్యంలో ఎవరికి వారు ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిలెండర్లను బ్లాక్ చేయడం ప్రారంభించారు. దీంతో ఒకటి రెండు సిలెండర్లు వాడుకునే హోటల్స్ కు సైతం ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చేసేది లేక చిన్నా చితకా హోటల్స్ సైతం ఆహార పదార్ధాల రేట్లు పెంచేస్తున్నాయి. దీనికి తోడు గ్యాస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు వారంలో ఒక రోజు సోమవారం హోటల్స్ ను బంద్ చేయాలని నిర్ణయించారు.

పెరుగుతున్న LPG ధరలకు వ్యతిరేకంగా సర్వైవల్ మోడ్‌లో AP హోటల్స్ ఆపరేటింగ్ గంటలను తగ్గించాయి.

దాదాపు హోటల్ తమ బయటి ఆర్డర్‌లను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రేపాటి నుంచి స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు స్వీకరించరాదని నిర్ణయించారు. అలాగే రాత్రి 10 గంటల వరకు హోటల్స్ పని వేళలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నాయి. ప్రభుత్వం ప్రకటనలను అంగీకరించకపోతే తామే హోటల్ స్వచ్చందంగా రాత్రి 10 గంటలకే మూసేల నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా సంక్షోభం ముదిరితే హోటల్స్ కేవలం టీ, కాఫీలు అమ్ముకునేందుకే పరిమితం కావాలని కోరుతున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular