అంతర్జాతీయ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం విషయంలో ఎవరు వెనక్కి తగ్గడం లేదు. మరో ఆరు పాటు యుద్ధం చేయగల సత్తా మీకు ఉందని నెలల ఇరాన్ యుద్ధం పైన వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు గల్ఫ్ లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ వ్యవస్థను ఇరాన్ దెబ్బతీసింది. థాడ్ లో ఉపయోగించే రాడార్ పరికరాలను ఇరాన్ ధ్వంసం చేసింది.
అట్టుడికిపోతున్న టెహ్రాన్
జోర్డాన్ లోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టం యుద్ధం ప్రారంభంలోనే దాడి చేసినట్లు అమెరికా అధికారులు కూడా ధృవీకరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించిన వేళ ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో టెహ్రాన్ అట్టుడికిపోతోంది.

ఆయిల్ స్టోరేజ్ ట్యాంకర్లను టార్గెట్ చేసిన ఇజ్రాయిల్
ఇరాన్ లోని ఆయిల్ స్టోరేజ్ ట్యాంకర్లను టార్గెట్ చేసిన ఇజ్రాయిల్, టెహ్రాన్ సమీపంలోని 30కి పైగా ఆయిల్ రిఫైనరీ కేంద్రాల పైనా దాడులు జరుగుతున్నాయి. ఇంధన మౌలిక సదుపాయాలపై అతిపెద్ద దాడి జరుగుతున్న ప్రపంచ ఇంధన ధరలు పెరుగుతాయి. టెహ్రాన్ సమీపంలోని స్టోరేజ్ సైట్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడిన ఇజ్రాయెల్ నగరానికి మూడు వైపులా ఉన్న ఆయిల్ రిఫైనరీలపై దాడులు జరుగుతున్నాయి.
మెహ్రాబాద్ ఎయిర్పోర్టు పైన విరుచుకుపడిన అమెరికా ఇజ్రాయెల్
మరోవైపు ఇరాన్ కూడా మిడిల్ ఈస్టులో ప్రతిదాడులు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో తొమ్మిదవ రోజైన నేడు టెహ్రాన్ లోని మెహ్రాబాద్ ఎయిర్పోర్టు పైన అమెరికా ఇజ్రాయిల్ విరుచుకుపడింది. ఈ ఎయిర్పోర్ట్ పై 80కి పైగా యుద్ద విమానాల పై విరుచుకుపడిన అమెరికా ఇజ్రాయిల్ ఎయిర్పోర్ట్ తో పాటు 16 ఐఆర్ జీసీ యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది.
రౌషే ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి
మరోవైపు లెబనాన్ రాజధాని బిరుట్ లోను రౌషేపై ఇజ్రాయెల్ దాడి చేసింది. 2024 హెజ్ బొల్లా ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రౌషె పైన తొలిసారిగా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దారితీసింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ దాడులతో నలుగురు మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి.
వారిని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ సైన్యం
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన కీలక కమాండర్ లను ప్రధానంగా టార్గెట్ చేసి ఇజ్రాయిల్ సైన్యం దాడికి పాల్పడింది. మొత్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న భీకర పోరులో ఇందన కేంద్రాల పైన మెరుపు దాడులు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

