Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సీనియర్ నేషనల్ వాటర్ పోలోకు కర్నూలు బాలికల ఎంపిక

సీనియర్ నేషనల్ వాటర్ పోలోకు కర్నూలు బాలికల ఎంపిక

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న ఐదుగురు క్రీడాకారిణులు

 

కల్లూరు, జూలై 06, (సీమకిరణం న్యూస్):

చెన్నైలో జరగనున్న సీనియర్ నేషనల్ వాటర్ పోలో ఛాంపియన్షిప్ కోసం ఎంపికైన ఆంధ్రప్రదేశ్ జట్టులో కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు బాలికలు చోటు దక్కించుకున్నారు. కర్నూలు నుంచి బి. సిరి చేతన రాజ్, కే. శృతి, హేమలత, లహరి, శాన్విత ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం కర్నూలు జిల్లాకు గర్వకారణమని క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులకు వారి కుటుంబ సభ్యులు, కోచ్‌లు, క్రీడా సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆంధ్రప్రదేశ్‌కు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular