Sunday, September 13, 2026
ads
📄 ePaper
Homeరాజకీయంసీఎం చంద్రబాబుపై బ్లేమ్ గేమ్ కోసం ఇక్కడ వైసీపీ సభ

సీఎం చంద్రబాబుపై బ్లేమ్ గేమ్ కోసం ఇక్కడ వైసీపీ సభ

📰 Generate e-Paper Clip

సీఎం చంద్రబాబుపై బ్లేమ్ గేమ్ కోసం ఇక్కడ వైసీపీ సభ

 

అది రాయలసీమ ఎత్తిపోతల కాదు, నెల్లూరు ఎత్తిపోతల పథకం

 

రాయలసీమ పేరుతో వైసీపీ ప్రజా ధనం దోసుకునేందుకే నెల్లూరు ఎత్తిపోతల

 

 వైసీపీ లూట్ మార్ రాజకీయం చేస్తోంది

 

– మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

 

నందికొట్కూరు, ఫిబ్రవరి 05, (సీమకిరణం న్యూస్):

రాయలసీమ పేరుతో నెల్లూరు కు నీళ్లు తరలించేందుకు వైసీపీ ప్రజా ధనం దోసుకుందని, రాయలసీమను వైసీపీ నయవంచన చేసిందని, రాయలసీమకు ద్రోహం చేసి ఛిగ్గులేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అబండాలు వేస్తూ వైసీపీ బ్లేమ్ గేమ్ ఆడుతుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, మిడ్తూరు మండలం అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగిన చోట విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్ నిర్వాకం వల్ల కేవలం కోటిన్నర రూపాయల నిధులు అలగనూరు రిజర్వాయర్ కు ఇవ్వనందుకు ప్రస్తుతం రూ. 60 కోట్ల కు మరమ్మాతులకు ఖర్చు చేయాల్చి వస్తుందని బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన నిర్లక్ష్యం కు సాక్ష్యంగా ఉన్న తెగి రిపేరుకు ఎదురు చూస్తున్న అలగనూరు రిజర్వాయర్ లో వైసీపీ సభ పెట్టింటే బాగుండేదని బైరెడ్డి అన్నారు. సీమ ఎత్తిపోతల పథకం వద్ద వైసిపి నేతల మీటింగ్ పెట్టడం పై బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపిలో ఒక్క నాయకుడికి వ్యవసాయం పై అవగాహన లేదనీ, ఉన్న వాళ్ళందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని, అలగనూరు తెగిపోయి గత ఐదేళ్ళలో వైసిపి పట్టించుకోలేదనీ, క్యూసెక్కులు అంటే తెలియని వాళ్లు వైసిపిలో ఉన్నారనీ, సీమ ప్రజలను నయవంచన చేయడానికి లిప్ట్ ఇరిగేషన్ ప్రాంతంలో మీటింగ్ పెట్టారని బైరెడ్డి మండిపడ్డారు. ఎవరిని మభ్యపెట్టాలని ఈ సభ పెటారని ఆయన నిలధీశారు. రాయలసీమ ఎత్తిపోతల అనుమతులు లేకుండా జగన్ మొదలు పెట్టి ఆయన పాలనలోనే గ్రీన్ ట్రిబ్యునల్ నిలిపివేస్తే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆపారని నిందలు వేయడం వైసీపీ నాయకులకే చెందిందన్నారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని, వైసీపీ లో క్యూసెక్కు, టీ ఎం సి లకు తేడా తెలియని వారు ఉన్నారని బైరెడ్డి ఎద్దేవా చేశారు. రాయలసీమ పేరుతో జగన్ దోసుకున్న నిధులు జగన్ నుంచి రికవరీ చేసి పెండింగ్ రాయలసీమ ప్రాజెక్టు లు పూర్తి చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాయలసీమ కరువు కష్టాలు చూసి వలస నివారణ తెలుగుగంగ, ఎస్ ఆర్ బి సి, జి ఎన్ ఎస్ ఎస్, హెచ్ ఎన్ ఎస్ ఎస్ ప్రాజెక్టులు చేపట్టారని బైరెడ్డి గుర్తు చేశారు. మన రాయలసీమ బిడ్డ, పులివెందుల బిడ్డ న్యాయం చేస్తారు అనుకుంటే జగన్ పాలనలోనే రాయలసీమ ఎక్కువ మోసపోయిందని, నయవంచనకు గురైందని, రాయలసీమ పేరుతో వైసీపీ దోపిడీకి పాల్పడిందని బైరెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ మరచిపోయారని, కడప జిల్లా లోని సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఒక్క ఎకరాకు పారుదల లేకుండా చేసి తన పర్యవేక్షణలోని భారతీ సిమెంట్ పరిశ్రమకు, జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి సుమారు 700 ఎకరాల బత్తాయి తోటలకు సాగు ఇస్తుందని జగన్ ఇది రైతులను మోసం చేయడం కాదా అని బైరెడ్డి నిలధీశారు.  రాయలసీమ ప్రజల ఓట్లతో అధికారం లోకి వచ్చి వారిని విస్మరించడం వల్లే రాయలసీమ లో వైసీపీ దారుణంగా ఓడిపోయిందని బైరెడ్డి అన్నారు. ఇప్పటికైన వైసీపీ నాయకులు సిద్దేశ్వరం వద్ద తీగల వంతెన బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం కోసం తమ పోరాటంలో కలిసి రావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ డి. సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు రోళ్లపాడు గ్రామ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, జలకనూరు స్వామిరెడ్డి, కోట మురళి, కౌన్సిలర్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular