17,746 ఓట్ల భారీ మెజారిటీతో శైలజ ఘనవిజయం!
ఓట్ల వర్షం కురిపించిన వెల్దుర్తి ప్రజలు.. శైలజకు అఖండ విజయం!
వెల్దుర్తిలో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు!
వెల్దుర్తి నజీర్, నవంబర్ 7 (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థిపై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మోడేపల్లి శైలజకు 22,641 ఓట్లు పోలవగా, బీఎస్పీ అభ్యర్థి సునీతమ్మకు 4,895 ఓట్లు లభించాయి. దీంతో శైలజ 17,746 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. కాగా, ఈ ఎన్నికల్లో నోటాకు 626 ఓట్లు నమోదయ్యాయి. మరో 767 ఓట్లు చెల్లనివిగా తేలాయి. శైలజ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో వెల్దుర్తి మండలంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో మండలంలో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

