తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
వెండితెరపై ‘డియర్ కామ్రేడ్’గా ఆమెను కాపాడాడు.. ‘గీత గోవిందం’గా ఆమె మనసు గెలుచుకున్నాడు. గత కొన్నేళ్లుగా అభిమానుల ఊహల్లో, సోషల్ మీడియా రూమర్లలో ఊగిసలాడిన విజయ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ)- రష్మిక (రష్మిక) ప్రేమాయణం ఎట్టకేలకు శుభం కార్డు వేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చారిత్రక కోట సాక్షిగా, ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఫిబ్రవరి 26న ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహానంతరం తొలిసారిగా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయాన్ని ఈ నూతన దంపతులు సందర్శించారు.
నూతన దంపతులు విజయ్ దేవరకొండ – రష్మిక వివాహనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన వేళ స్వామివారి ఆశీర్వాదం పొందడం ద్వారా తమ ఆనందాన్ని ఆధ్యాత్మికంగా ఆరంభించారు.

ఎగబడిన ఫ్యాన్స్..
ఆలయ దర్శనం అనంతరం అభిమానులకు స్వీట్లను అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘విరోష్’ జోడీ (విరోష్) వస్తున్నారనే సమాచారం ముందుగానే వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆలయానికి తరలివచ్చారు. భద్రతా ఏర్పాట్లు స్వీట్లు అందుకోవాలంటే ఆత్రుతతో అభిమానులు ముందుకు దూసుకెళ్లారు. పరిస్థితిని గమనించిన ఈ జంట కొందరికి స్వీట్లు అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించాయి.
#విరోష్ స్వీట్లు పంచిపెట్టు ❤️#విజయ్ దేవరకొండ #రష్మిక మందన్న pic.twitter.com/XxLZXWjpAp
— దేవరకొండ (@VijayDe78593148) మార్చి 1, 2026
ఉదయ్‌పూర్‌లో ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం అందించామని ప్రకటించారు. “మా ప్రయాణంలో మీరు అందరూ భాగమే. మా పెళ్లి వేడుకలను మీతో కలిసి జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది” అని అభిమానులను ఉద్దేశించి అన్నారు.
తెలుగు పలు నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు ప్రసిద్ధ దేవాలయాల్లో అన్నదానం జరిగింది. వేడుకల అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట త్వరలో నిర్వహించనున్న స్వాగత వేడుకకు సినీ ప్రముఖులు, ఆత్మీయులు హాజరుకానున్నారు. అభిమానులతో అనుబంధాన్ని మరింత బలపరిచేలా ఈ వేడుకలు సాగడం విశేషంగా మారింది.

