Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

📰 Generate e-Paper Clip

రూ.10 లక్షల విలువైన లారీ స్వాధీనం.. నిందితులపై గతంలోనూ పలు దొంగతనం కేసులు

 

 

కర్నూలు క్రైమ్, నవంబర్ 10 (సీమకిరణం న్యూస్):

 

 

లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి, సుమారు రూ.10 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కర్నూలు నాలుగో పట్టణ సీఐ బి.వి. విక్రమ సింహ వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు వన్‌టౌన్ పరిధిలోని దండిగేరికి చెందిన ప్రేమనాథ్ తనకు చెందిన AP04 U 5526 నంబరు గల లారీని రిలయన్స్ మార్ట్ సమీపంలోని లారీ అసోసియేషన్ యార్డులో పార్కింగ్ చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆ లారీని దొంగిలించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీల ఆధారంగా ఇద్దరు అనుమానితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా, వారు కర్నూలు ముజఫర్ నగర్‌కు చెందిన సతీష్, గోపాల్‌గా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల కదలికలపై కచ్చితమైన సమాచారం అందడంతో పందిపాడు సమీపంలోని గోడ ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం వారిని అరెస్టు చేశారు. వారు పార్కింగ్ చేసి ఉంచిన దొంగిలించిన లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో సతీష్ గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడని, కొంతకాలంలోనే రెండు లారీలకు యజమానిగా మారినట్లు వెల్లడైంది. వ్యాపారం సరిగా సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, అప్పులు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్ సంస్థలు అతని లారీలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యాక్టింగ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ అప్పులు తీర్చుకునేందుకు మరో లారీని దొంగిలించి విక్రయించాలనే ఉద్దేశంతో దాచిపెట్టినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఇక గోపాల్‌పై కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌తో పాటు ఆత్మకూరు తదితర పోలీస్ స్టేషన్లలో ఎనిమిదికి పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరిచి నిరంతరం నిఘా ఉంచనున్నట్లు సీఐ బి.వి. విక్రమ సింహ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular