Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మార్కెట్ అభివృద్ధే లక్ష్యం.. చిరు వ్యాపారులకు అండగా ఉంటా!

మార్కెట్ అభివృద్ధే లక్ష్యం.. చిరు వ్యాపారులకు అండగా ఉంటా!

📰 Generate e-Paper Clip

సుంకాల భారం తగ్గిస్తా.. వ్యాపారులకు అండగా నిలుస్తా!

 

వెల్దుర్తి సంత మార్కెట్‌కు మహర్దశ తీసుకొస్తా.. 

 

మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. చిరు వ్యాపారులకు రమేష్ శెట్టి హామీ

 

 

షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తా..

 

 

మాటలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తా

 

చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతా

 

సంత మార్కెట్‌లో వ్యాపారులను కలిసి సమస్యలు తెలుసుకున్న సర్పంచ్ అభ్యర్థి రమేష్ శెట్టి

 

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 15 (సీమకిరణం న్యూస్):

 

 

వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త తిరివీధి రమేష్ శెట్టి ఆదివారం పట్టణంలోని సంత మార్కెట్‌ను సందర్శించి చిరు వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, తోపుడు బండ్ల నిర్వాహకులు, దుకాణదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ అభివృద్ధికి, చిరు వ్యాపారుల సంక్షేమానికి తాను చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.!ఈ సందర్భంగా రమేష్ శెట్టి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలను దగ్గరగా చూశానని, వారి ఇబ్బందులను అర్థం చేసుకున్నానని తెలిపారు. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే చిరు వ్యాపారులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 

సంత సుంకాలు, రోజువారీ వసూళ్ల రద్దుకు హామీ

 

వారపు సంతలో వ్యాపారం చేసే వారు, రోజువారీ కూరగాయల వ్యాపారులు, తోపుడు బండ్ల నిర్వాహకులు, మార్కెట్‌లోని దుకాణదారులపై విధిస్తున్న సుంకాలను రద్దు చేసి, వాటి స్థానంలో ట్రేడ్ లైసెన్సులు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన ఖర్చును సైతం తానే భరిస్తానని పేర్కొన్నారు. కూరగాయలు తీసుకొచ్చే రవాణా వాహనాల సుంకాలను తగ్గించి, తద్వారా వ్యాపారులకు ఉపశమనం కలిగించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు అందేలా కృషి చేస్తానన్నారు.

 

మార్కెట్‌లో మౌలిక వసతుల కల్పన…!

 

మార్కెట్‌లో చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తానని, ఎండ, వానల నుంచి రక్షణ కోసం టార్పాలిన్లను సబ్సిడీపై అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మహిళలు, పురుషుల కోసం ఆధునిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు రైతుబజార్ తరహాలో వెల్దుర్తిలోనూ రైతుబజార్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.

 

దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తా..!

 

చికెన్, మటన్ దుకాణాల నుంచి ప్రభుత్వ గెజిట్ నిబంధనల ప్రకారమే సుంకాలు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటానని, పంచాయతీకి చేరాల్సిన ఆదాయం మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తానని పేర్కొన్నారు. గతంలో తన తండ్రి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకున్నారని, వాటికి మించి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నానని తెలిపారు. తాను కేవలం పదవి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచానన్నారు. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే మొదటి ఆరు నెలల్లోనే మార్కెట్‌లో షెడ్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానని, అవసరమైతే తన సొంత నిధులతోనూ పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తనను నేరుగా నిలదీసే హక్కు గ్రామస్తులకు ఉంటుందని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును ఆలోచించి వినియోగించుకోవాలని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి తన పనితీరును పరిశీలించాలని చిరు వ్యాపారులను కోరారు. మార్కెట్ అభివృద్ధి, చిరు వ్యాపారుల సంక్షేమం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, మెరుగైన మౌలిక వసతుల కల్పనే తన ప్రధాన లక్ష్యాలని రమేష్ శెట్టి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular