Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చిరు వ్యాపారులకు ప్రోత్సాహం.. ఉపాధికి అండగా ఉంటా!

చిరు వ్యాపారులకు ప్రోత్సాహం.. ఉపాధికి అండగా ఉంటా!

📰 Generate e-Paper Clip

చిరు వ్యాపారులకు ప్రోత్సాహం.. ఉపాధికి అండగా ఉంటా!

 

వెల్దుర్తి సంత మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతా

 

కర్నూలు ప్రతినిధి నజీర్, నవంబర్ 16 (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి పట్టణంలోని చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, చిల్లర దుకాణదారులు, మాంసం విక్రయదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి టీవీ రమేష్ తెలిపారు. గ్రామంలోని చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తూ వారి జీవనోపాధికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటించిన హామీల్లో భాగంగా తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలను గుర్తించి వారికి పంచాయతీ రుసుము తగ్గించి గజిట్ ప్రకారం ప్రోత్సాహక రాయితీలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. చికెన్, మటన్ షాపుల యజమానులకు గజిట్ ప్రకారం సుంకాల తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.వెల్దుర్తి సంత మార్కెట్‌లో వ్యాపారులు వర్షం, ఎండలకు ఇబ్బందులు పడకుండా పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. అలాగే వ్యాపారులు వారంసుంకం అధికంగా చెల్లించకుండా గజిట్ ప్రకారం సుంకాలు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని, వ్యాపారులకు అవసరమైన లైసెన్సులు ఇప్పించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. లారీల సుంకాలను కూడా ప్రజలకు భారం తగ్గించే విధంగా క్రమబద్ధీకరించి, వెల్దుర్తి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మార్కెట్‌లో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మార్కెట్ వ్యాపారులకు అవసరమైన తార్పాలిన్ కవర్లు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. చిరు వ్యాపారుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, మార్కెట్ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యాలని టీవీ రమేష్ స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పిస్తే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular