Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు

భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు

📰 Generate e-Paper Clip

జలవనరుల పరిరక్షణే లక్ష్యం 

 

భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

వెల్దుర్తిలో పూడికతీత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

 

జిల్లా వ్యాప్తంగా జలధార–జలహారతి కార్యక్రమంపై ప్రత్యేక పర్యవేక్షణ

 

కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మే 20, (సీమకిరణం న్యూస్): 

జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. బుధవారం వెల్దుర్తి మండలంలో నిర్వహిస్తున్న జలధార–జలహారతి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగులవంకలో చేపట్టిన పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జలధార-జలహారతి కార్యక్రమం కింద 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించడం జరిగిందన్నారు. భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా చెరువులని ఫీడ్ చేసే కాలువలు, వంకలు, వాగులు, బుష్ క్లియరెన్స్ లాంటివి క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. వెల్దుర్తి ఫీల్డ్స్‌ నుంచి వచ్చే క్యాచ్‌మెంట్ నీరు నాగులవంకలో చేరి, అక్కడి నుంచి నార్లపురం వద్ద పెద్ద వాగు ద్వారా హంద్రీలోకి ప్రవహిస్తుందని తెలిపారు. వెల్దుర్తి గ్రామంలో 350 వర్క్స్ గుర్తించడం జరిగిందని, అందులో 154 శాంక్షన్ చేశామని, ఇప్పటికీ 62 గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఐదు లక్షల వర్త్ తో లేబర్ కాంపోనెంట్‌తో 120 మంది మనుషులు 3 రోజుల నుంచి వర్క్ చేస్తున్నారన్నారు. వెల్దుర్తి గ్రామంలో 5.2 మీటర్ల లోతులో నీరు ఉందని, దాన్ని 3 మీటర్లకి తీసుకుని రావాలన్నారు. ఇక్కడ పనులు పూర్తై వర్షాలు పడిన తర్వాత వర్షం నీరంతా కూడా ఇక్కడ చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అన్ని మండలాల్లో కలిపి 5500 పనులను గుర్తించడం జరిగిందన్నారు. 5500 పనులలో ఇప్పటికే 3500 పనులకు శాంక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో 1600 నుండి 1700 వరకు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. 40 ఏళ్ల నుండి పులికుంట ట్యాంక్ నిండలేదని చెప్తున్నారని, కాబట్టి ముందు ఆ ట్యాంక్ దగ్గర పనులు చేసి చెరువు నిండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైతే ఉపాధి హామీ శ్రామికులతో పని చేయించలేమో, అక్కడ ఎక్స్‌కవేటర్స్, జెసిబిలు పెట్టించి పనులు చేయిస్తున్నామన్నారు. వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు నిర్ధారించారు కాబట్టి, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి ద్వారా సాగు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఆ పద్ధతి ద్వారా భూమి తాలూకా సారం పెరుగుతుందన్నారు.. ఈ పంటను రైతులు అమ్ముకుంటే ఎండాకాలం పంట లేకపోయినా 30 వేల రూపాయల వరకు మిగులుతుందన్నారు. అదే విధంగా పాడి పశువులను కూడా పెంచుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఎండకి భూమి ఎక్స్పోజ్ అయినప్పుడు 50 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుందని, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ పంటలో టెంపరేచర్ చూస్తే 30 డిగ్రీలు ఉంటుందన్నారు. ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకుండా తప్పనిసరిగా చదివించాలన్నారు. అమ్మాయిలు చదువుకుని తమ కాళ్లపై నిలబడేలా ప్రోత్సహించాలన్నారు. వారు మంచి స్థాయికి చేరుకుని కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటారన్నారు. కాబట్టి బాల్య వివాహాలకు దూరంగా ఉండి, ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ‘అక్షరాంధ్ర’ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా చేపడుతున్నామన్నారు. గత అక్షరాంధ్ర కార్యక్రమంలో 60 ఏళ్లు, 65 ఏళ్లు, 70 ఏళ్ళ ఉన్నవారు కూడా వచ్చి రాత్రి బడిలో చదువుకోవడం జరిగిందన్నారు. అక్షరాంధ్ర లో భాగంగా పెట్టిన పరీక్షలో 100% పాస్ అయ్యారన్నారు. ఈ సంవత్సరం కూడా 100 శాతం పాస్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది 1,85,000 మంది పాస్ అయ్యే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. గత సంవత్సరం 1,60,000 మంది పాస్ అయ్యారన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ఎండాకాలం కాబట్టి ఉపాధి హామీ శ్రామికులు ఉదయం 6 గంటలకు పనులకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డ్వామా పిడి నరసింహ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్, డ్వామా ఏపిడి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular