Tuesday, April 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నకిలీ వెబ్ సైట్ల విషయంలో జాగ్రత్త | తిరుమల తిరుపతి...

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నకిలీ వెబ్ సైట్ల విషయంలో జాగ్రత్త | తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తున్నాయని భక్తులను హెచ్చరించింది టీటీడీ అధికారులు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంటే వారు కోట్లలోనే ఉంటారు. దేశవ్యాప్తంగా నిత్యం లక్ష మందికి పైగా భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే శ్రీవారి దర్శనాలు, సేవలకు భక్తులు ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో ఆధార పడుతున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని దానికి తగ్గట్టు పాలన్ చేసుకుని వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు.

టీటీడీ దర్శన టోకెన్ ల బుకింగ్ విషయంలో జాగ్రత్త

కొందరు నేరుగా వచ్చి సర్వ దర్శనం లేదా స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లతో శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రతి నెలా భక్తులు టీటీడీ విడుదల చేసే టిక్కెట్ల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇక శ్రీవారి దర్శన టికెట్లకు తీవ్ర డిమాండ్తో, అవి క్ష‌ణాల్లోనే బుకింగ్‌ అవుతాయి. శ్రీవారి దర్శనాలు, వసతి బుకింగ్‌ల సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తున్నాయని భక్తులను హెచ్చరించింది టీటీడీ అధికారులు

నకిలీ వెబ్ సైట్ లతో మోసం చేస్తున్న కేటుగాళ్ళు

టీటీడీ వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి కొందరు మోసగాళ్ళు భక్తులను మోసం చేస్తున్నారు. ఈ పరిశీలన టీటీడీ గుర్తించింది. ఈ నకిలీ సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది. నకిలీ వెబ్ సైట్లు భక్తుల నుండి భారీగా ఆన్ లైన్ చెల్లింపులు వసూలు చేస్తున్నాయని టీటీడీ గుర్తించింది. ఈ మేరకు భక్తులను అప్రమత్తం చేస్తుంది టీటీడీ.

కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో నకిలీ వెబ్ సైట్ కేసు నమోదు

నకిలీ సైట్ల మోసాలను అరికట్టేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘా పెంచింది. తాజాగా కేరళకు చెందిన భక్తుడు సీకే సురేష్ బాబు “కర్ణాటక ప్రవాసి సౌధ” పేరుతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా తిరుమలలో గదులు ఇప్పిస్తామని నమ్మించి మోసగించారు. సురేష్ బాబు ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు వెంటనే తిరుమల దర్యాప్తు చేస్తున్నారు.ఈ సైట్లు టీటీడీ లోగోలు, ఆలయ తనిఖీలు అనధికారికంగా వాడుకుంటున్నారని అధికారులు తేల్చారు.

అధికారిక వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలి

టీటీడీ ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసి, కాపీరైట్ చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదు చేసింది. భక్తులు ఏ వెబ్ సైట్ పడితే అది నమ్మరాదని టీటీడీ. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in మాత్రమే సందర్శించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు, దళారులను నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని, మోసపోవద్దని టీటీడీ సూచిస్తోంది. అనుమానాస్పద వెబ్‌సైట్‌లు, యాప్‌లు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular