Friday, May 15, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఇంధన పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించిన సిఐ మారుతి శంకర్

ఇంధన పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించిన సిఐ మారుతి శంకర్

📰 Generate e-Paper Clip

ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచిన కర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి. మారుతి శంకర్

 

కర్నూలు క్రైమ్, మే 15, (సీమకిరణం న్యూస్ ):

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన పొదుపు అత్యంత అవసరంగా మారిందని కర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి. మారుతి శంకర్ పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  , మంత్రులు కూడా ఇంధన పొదుపు చర్యలకు మద్దతుగా తమ కాన్వాయ్‌ల వాహనాల సంఖ్యను తగ్గిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఇంధన పొదుపు పై అవగాహన కల్పించేందుకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  గారి ఆదేశాల మేరకు కర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి. మారుతి శంకర్  తన నివాసం నుండి కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నడిచి వెళ్లి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కర్నూలు ఒన్ టౌన్ సిఐ మారుతి శంకర్  మాట్లాడుతూ ఇంధన పొదుపు ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రతి ఒక్కరు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమాజానికి, దేశానికి ఎంతో మేలు జరుగుతుందని, అవసరం లేని వాహన వినియోగాన్ని తగ్గించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular