Tuesday, April 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅర్ధరాత్రి పాకిస్తాన్ మెరుపు దాడులు- F-16 ఫైటర్ జెట్ లతో బాంబుల వర్షం | ఆఫ్ఘనిస్తాన్...

అర్ధరాత్రి పాకిస్తాన్ మెరుపు దాడులు- F-16 ఫైటర్ జెట్ లతో బాంబుల వర్షం | ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించింది, ఏడు తీవ్రవాద శిబిరాల్లో అనేక మంది మరణించారు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

పాకిస్తాన్ ఘాతుకానికి తెగబడింది. పొరుగుదేశం ఆఫ్ఘానిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆ దేశ భూభాగంపై మెరుపుదాదులు చేసింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలు 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడులను అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. సరిహద్దుల వెంబడి ఏడుచోట్ల వైమానిక దాడులు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు.

కొద్దిరోజుల కింద పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఓ మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి ఆఫ్ఘనిస్తాన్, భారత్ ప్రధాన కారణమంటూ ఆరోపిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత్ ఈ దాడులకు ప్రణాళికలు రచించిందని, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ అమలు చేసిందనీ చెబుతోంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ పై తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది పాకిస్తాన్. ఈ దాడులు పక్తికా ప్రావిన్స్‌తో పాటు సరిహద్దు వెంబడి ఉన్న ఖోస్ట్, పయా, నంగర్‌హర్ వంటి ఇతర ప్రావిన్స్‌లలో టీటీపీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించింది, ఏడు తీవ్రవాద శిబిరాల్లో అనేక మంది మరణించారు

గత ఏడాది మే లో భారత్ పై డ్రోన్ దాడికి పాల్పడిన అనంతరం ఈ స్థాయిలో పాకిస్థాన్ మరోమారు ఎయిర్ స్ట్రైక్స్ కు దిగడం ఇదే తొలిసారి. డ్యురాండ్ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 28 మంది టీటీపీ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. తూర్పు- ఆగ్నేయ ఆఫ్గానిస్తాన్‌లోని పలు ప్రాంతాలలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

మొత్తం ఎనిమిది లక్ష్యాలను ఛేదించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్లు, జేఎఫ్-17 థండర్ విమానాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. పక్తికా ప్రావిన్స్‌లోని బార్మల్ జిల్లాలో అనేక పేలుళ్లు సంభవించినట్లు స్థానికంగా ఉన్నాయి. మార్ఘా ప్రాంతంలో వరుసగా పలు బాంబుల శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. బర్మల్‌లోని బానుసి మదర్సాపై గుర్తుతెలియని విమానం ద్వారా క్షిపణులను ప్రయోగించినట్లు చెబుతున్నారు.

పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఎక్స్ ద్వారా దాడులను ఏర్పాటు చేశారు. టీటీడీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు స్థావరాలు, అలాగే ఐసిస్‌తో సంబంధం ఉన్న ఓ క్యాంప్ పై తమ సైన్యం నిఘా ఆధారిత ఆపరేషన్లు చేసిందని తెలిపారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడులను ఖండించింది. పాకిస్తాన్ ఒక మదర్సాపై దాడిలో 19 మంది పౌరులను బలిగొందని కనుగొన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అఫ్ఘానిస్తాన్ హెచ్చరించింది.

ఈ వైమానిక దాడులు జరగడానికి ముందు రోజు అంటే శనివారం నాడు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్నూ జిల్లాలో జరిగిన ఓ ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్థాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. టీటీపీ ఉగ్రవాదులు, వారిలో ఒక ఆత్మాహుతి బాంబర్‌లో ఉన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అయిదుమంది ఖవారిజ్” మిలిటెంట్లు హతమయ్యారు. ఖవారిజ్ అనేది నిషేధిత టీటీపీకి ప్రత్యామ్నాయ పదంగా వాడతారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular