Monday, April 27, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం

📰 Generate e-Paper Clip

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం

 

• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

 

  • • ‘ప్రజా ఫిర్యాదుల’ స్వీకరణకు 13 అర్జీలు

కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 27, (సీమకిరణం న్యూస్):

మీ కోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు అధికారులు పరిష్కార మార్గం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు సంబంధించి 13 అర్జీలు రాగ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, కార్యదర్శి నాగరాజు, ఆర్వో స్వర్ణలత, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, తదితరులు పాల్గొన్నారు.

 

*వచ్చిన విన్నపాల్లో కొన్ని..*

 

1. వివియస్ ఫంక్షన్ హాల్ పరిసర కాలనీల్లో వీధి దీపాలు వెలగడం లేదని, మరమ్మత్తులు చేపట్టాలని యు‌.నాగన్న అర్జీ సమర్పించారు.

2. అపూర్వ గార్డెన్స్ వద్ద ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని స్థానికులు భాస్కర్, జయరాం, రమేష్ రెడ్డి, తదితరులు విన్నవించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular