🔥ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్
🩺ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం
క్యాన్సర్ కణాలను గుర్తించి నయం
ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్
కర్నూలు వైద్యం, మే 21, (సీమకిరణం న్యూస్):
భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. *ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల కోసం కేవలం ఏడు నిమిషాల్లో పనిచేసే సరికొత్త ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. రోచ్ ఫార్మా ఇండియా సంస్థ ‘టెసెంట్రిక్’ పేరుతో ఈ ఇమ్యునోథెరపీ మందును మార్కెట్‌లోకి విడుదల చేసింది. కీమోథెరపీలా కాకుండా ఇమ్యునోథెరపీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తుంది. *ఈ ఇంజెక్షన్‌లోని ‘అటెజోలిజుమాబ్’ అనే మందు క్యాన్సర్ కణాల్లో ఉండే పీడీ-ఎల్1 ప్రొటీన్‌ను అడ్డుకుంటుంది. ఇది బ్లాక్ అవడం వల్ల శరీరంలోని రోగనిరోధక కణాలు క్యాన్సర్ సెల్స్‌ను సులభంగా గుర్తించి నాశనం చేస్తాయి.* ఈ మందుల తయారీలో వాడే అధునాతన సాంకేతికత, లోతైన పరిశోధనల వల్లే ధరలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. *రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రోచ్ సంస్థ ‘బ్లూ ట్రీ’ అనే సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) కింద కూడా ఈ చికిత్సకు రీయింబర్స్‌మెంట్ సదుపాయాన్ని కల్పించారు.

