తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల మున్సిపల్లో అత్యధిక వార్డులు, ఎన్నికల కార్పొరేషన్లో అత్యధిక డివిజన్లను కైవసం చేసుకొని రాష్ట్రంలో విజయ కేతనాన్ని ఎగురవేస్తుంది. 116 మున్సిపాలిటీలలో 66 చైర్మన్ పీఠాలను స్పష్టమైన ఆధిక్యంతో దక్కించుకుంది. ఏడు మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ మూడు పీఠాలు గెలుచుకోగా, మరో చోట్ల హంగ్ ఏర్పడింది.
ఆ చైర్మన్లు, మేయర్ స్థానాల కోసం రంగంలోకి రేవంత్
వీటిని కూడా దక్కించుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజారిపోకుండా ప్లాన్ చేసిన సీఎం రేవంత్ పకడ్బందీ వ్యూహం ముందుకు వెళ్లాలని మంత్రులకు ఆదేశం ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరే ఆసక్తి ఉన్న స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల వారిని గుర్తించిన వెంటనే వారిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయాలని దిశా నిర్దేశం చేశారు.

హంగ్ ఏర్పడిన చోట వారికి బాధ్యతలు
హంగ్ ఏర్పడిన స్థానాలను దక్కించుకోవడానికి వ్యూహాలను అమలు చేయాలని రేవంత్. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఇన్చార్జి మంత్రితో పాటు, మరో మంత్రి లేదా సీనియర్ నేతలను ఇన్చార్జిలుగా నియమించారు. మీరు హంగ్ ఏర్పడిన చోట ఆ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడానికి మద్దతు కూడగట్టే పని చేస్తారు.
కొనసాగుతున్న క్యాంప్ రాజకీయాలు
కొన్ని మున్సిపాలిటీల మజ్లిస్, వామపక్షాల కౌన్సిలర్లు ఓట్లు కీలకం కాగా, వారితో చర్చించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చైర్ పర్సన్ లు, మేయర్ ల ఎన్నిక ఫిబ్రవరి 16వ తేదీన మధ్యాహ్నం జరగాల్సి ఉండగా, హంగ్ ఏర్పడిన కాంగ్రెస్ కౌన్సిలర్లను, మద్దతు పలికే క్యాంపులకు తరలించి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి.
మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేసే స్కెచ్
ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కీలక నేతలను రంగంలోకి దింపి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నచోట వారిని సైతం అలర్ట్ చేస్తున్నారు. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు.

