Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపోలీస్ వేషం చూసి మోసపోకు: ఆసక్తికర పోస్ట్ చేసిన సజ్జనార్! | డిజిటల్ అరెస్టులపై అప్రమత్తమైన...

పోలీస్ వేషం చూసి మోసపోకు: ఆసక్తికర పోస్ట్ చేసిన సజ్జనార్! | డిజిటల్ అరెస్టులపై అప్రమత్తమైన హైదరాబాద్ సీపీ సజ్జనార్.. నకిలీ పోలీసులపై వీడియోతో అవగాహన కల్పించారు.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఇటీవల కాలంలో పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ కంటే సైబర్ నేరాలను కట్టడి చేయడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకునే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త వనరులను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి గురవుతున్నారు. ఇక అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

బాగా పెరిగిపోయిన డిజిటల్ అరెస్ట్ మోసాలు

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేస్తున్న మోసగాళ్లు తమను సిబిఐ, ఈడి, ఐటి లేదా పోలీస్ అధికారులుగా పరిచయం చేసుకుంటూ వీడియో కాల్స్ చేస్తున్నారు. మీ పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, మనీ ల్యాండరింగ్ కేసులో మీ పేరు ఉందని భయపెడుతున్నారు. కేసు నమోదు కాకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు అందించిన వారి పైన ఒత్తిడి తెస్తున్నారు.

డిజిటల్ అరెస్టులపై అప్రమత్తమైన హైదరాబాద్ సీపీ సజ్జనార్ వీడియోతో నకిలీ పోలీసులపై అవగాహన కల్పించారు

అవగాహనా వీడియో పంచుకున్న సజ్జనార్

సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడిన కొందరు ఉన్నత విద్యావంతులు కూడా వారు అడిగిన డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఈ విధంగానే సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ vc సజ్జనార్ ఒక అవగాహన వీడియోను పంచుకున్నారు. పోలీసులు ఎప్పుడు వాట్సప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయరని, డబ్బులు అడగరని, డిజిటల్ అరెస్ట్ అనే పదం చట్టంలో అసలు లేనేలేదని గుర్తించారు.

ఆ కాల్స్ నమ్మొద్దు

ఇటువంటి కాల్స్ వస్తే ఎవరు భయపడకూడదు అని, వెంటనే కాల్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించిన పోలీస్ కమిషనర్ vc సజ్జనార్ తెలిపారు. అంతేకాదు అనుమానాస్పద వీడియో కాల్స్ ను నమ్మొద్దని, పేర్కొన్న, ఓటిపి లు, బ్యాంక్ వివరాలను ఎప్పుడు ఎవరితో పంచుకోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అప్పుడే సైబర్ మోసాలను అరికట్టగలుగుతామని ఆయన తెలిపారు.

జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్

1930 సైబర్ హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అంతేకాదు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన జాగృతి హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఈ అవగాహన వీడియోను షేర్ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పించాలని మీ రక్షణ మీ రక్షణ అంటూ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular