Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeఅంతర్జాతీయంజనగణమనకు ముందు వందేమాతరం

జనగణమనకు ముందు వందేమాతరం

📰 Generate e-Paper Clip

🇮🇳జనగణమనకు ముందు వందేమాతరం🇮🇳

 

తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలు

 

బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయాన్ని జనగణమన గీతం కంటే ముందే ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతే కాక ఈ గేయంలోని మొత్తం ఆరు చరణాలను ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక, పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఆలపించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించే వారు. తర్వాత దుర్గా మాత గొప్పదనాన్ని తెలియజేసే చరణాలను ఆలపించే వారు కారు. అయితే ఇకపై మొత్తం గేయాన్ని ఆలపించాల్సిందే. పాఠశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యకలాపాల్లో జాతీయ గీతం జనగణమనకు ముందు దీనిని తప్పక వినిపించాలి. ఆ గేయం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిల్చోవాలి. అలాగే పౌర అవార్డుల ప్రదాన సమయంలో, రాష్ట్రపతి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు కూడా ఆలపించాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular