Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవాలంటైన్స్ డే.. లాఠీలకు నూనె రాసి ఎముకలు విరిచేస్తామని సీరియస్ వార్నింగ్ | ప్రేమికుల రోజు.....

వాలంటైన్స్ డే.. లాఠీలకు నూనె రాసి ఎముకలు విరిచేస్తామని సీరియస్ వార్నింగ్ | ప్రేమికుల రోజు.. సెలబ్రేట్ చేసుకుంటే ప్రేమికుల ఎముకలు విరగ్గొడతాయని క్రాంతి సేన సీరియస్ వార్నింగ్

📰 Generate e-Paper Clip


భారతదేశం

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే.. ప్రపంచవ్యాప్తంగా ఈ వాలెంటైన్స్ డే ను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం భారతదేశంలో మాత్రం కొన్ని వర్గాల నుంచి వాలెంటైన్స్ డే పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తుందని భారతీయ సాంప్రదాయాలు, విలువలకు విరుద్ధమైనవి అని కొన్ని ముఖ్యమైన హిందూ సంఘాలు వాదిస్తూ వస్తున్నాయి.

వాలెంటైన్స్ డే జరుపుకోవటాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాలు

వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి వ్యతిరేకిస్తున్నాయి. ఇక వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు కలవకుండా పార్కుల దగ్గర, రెస్టారెంట్ల దగ్గర నిఘా పెడుతున్నారు. ముఖ్యంగా విశ్వ హిందు పరిషత్తు, బజరంగదళ్, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తదితర సంస్థలు, వీటికి అనుబంధంగా కొన్ని సంస్థలు హిందూ యువ వాహిని, శ్రీరామ్ సేన స్టేట్ వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే ప్రేమికుల ఎముకలు విరిగిపోతాయని క్రాంతి సేన సీరియస్ వార్నింగ్

నో వాలెంటైన్స్ డే… హిందూ సంఘాల హెచ్చరికలు

వాలెంటైన్స్ డే రోజు లవర్స్ దొరికారు అంటే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. ఇప్పటికే అనేక చోట్ల ఇది మన హిందూ సంస్కృతికి వ్యతిరేకమని, పాశ్చాత్య సంస్కృతిని ఇది పెంచుతుందని, దీనిని జరుపుకోవడానికి వీల్లేదని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ప్రాంతాలలో ప్రసారమైన హిందూ సంఘాల హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

యూపీలో లేఖలు పంచుతూ హెచ్చరికలు

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈసారి వాలెంటైన్స్ డే జరుపుకోకుండా ఇప్పటి నుంచే లేఖలను పంచుతూ హెచ్చరికలను జారీ చేస్తోంది క్రాంతి సేన. ప్రేమికుల దినోత్సవం ముంగిట యూపీ ముజఫర్‌నగర్‌లోని ‘క్రాంతి సేన’ ప్రేమికులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ‘ప్రేమికులు ఎక్కడ కనిపించినా వారి ఎముకలు విరిచేస్తాం’ అని లాఠీలకు నూనె రాస్తూ హెచ్చరించింది.

వాలెంటైన్స్ డే చేస్తే వారికి కూడా చుక్కలే

కిస్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, వాలంటైన్స్ డే వేడుకలు విదేశీ అని క్రాంతి సేన సంస్కృతిని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 14న అనుమానాస్పద స్థితుల్లో జంటలు కనిపిస్తే వారితో పాటు హోటల్, రెస్టారెంట్ యజమానులపై చర్యలు తీసుకుంటామని లేఖలు పంచింది. ఇక యూపీలో ఈ తీవ్ర హెచ్చరికల మధ్య వాలెంటెన్స్ డే జరుపుకోవడం ప్రేమికులకు కష్టమే.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular