జలజీవన్ పధకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరు
పైపు లైన్ పనులు ప్రారంభించిన టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర నాద్
చీరాల, ఫిబ్రవరి, 07,(సీమకిరణం న్యూస్)
అభివృద్దే ద్యేయం గా కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌళిక వసతులు కల్పనకు కృషి చేస్తూ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగినీరు సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. చీరాల నియోజకవర్గ పరిధిలో స్థానిక శాసనసభ్యులు కొండయ్య ఆధ్వర్యంలో అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పనకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని పెర్లవారిపాలెం గ్రామం లో జలజీవన్ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు పైపు లైన్ పనులను తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి మహేంద్ర నాద్ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ ప్రతి గ్రామం లో ప్రజలకు ముఖ్య అవసరాలైన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు ఇతర మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ఎమ్మెల్యే కొండయ్య శారథ్యంలో నిరంతరం కృషి చేస్తున్నామని, జలజీవన్ పథకం ద్వారా త్రాగు నీరు సమస్యలు లేకుండా పైప్ లైన్స్ వేస్తూ త్రాగు నీరు అందించేందుకు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.గ్రామ ప్రజలు అందరు ఐక్యత గా ఉండి గ్రామ అభివృద్ధికి సహకరిస్తే పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, గ్రామాల లో వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో తెలుగు దేశం అధికారప్రతినిధి మహేంద్ర నాద్, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

