జీ తెలుగు ఆట కొత్త సీజన్ 7న ప్రారంభం
నిజామాబాద్, ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్) :
తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న జీ తెలుగు ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడంలోనూ ముందుం టుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో జీ తెలుగు ‘ఆట’. ఈ కార్యక్రమంతో ఎందరో ప్రతిభావంతులైన డాన్సర్లను వెలుగులోకి తీసు కొచ్చిన జీ తెలుగుఆట సరికొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుల్లితెర పాపులర్డాన్స్ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఈ నెల 7న ప్రారంభం కానుంది. , ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9గంటలకు, మీ జీ తెలుగు లో.. ఈ నెల 5 నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో కొత్త ఎపిసోడ్స్ టీవీ కంటే 48 గంటల ముందే మన జీ5లో! ఎందరో ప్రతిభావంతులను వెండి తెరకు పరిచయం చేసిన ఆట సరికొత్త సీజన్ కు ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటర్స్ కావ్య, విష్ణుప్రియ, వంశీ, సమీరా భర ద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీ పడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికాశరత్ కుమార్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మెగాడాటర్ నిహారికా కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆటసరికొత్త సీజన్ ప్రారంభ ఎపిసోడ్ నందు అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్ పోటీ పడనున్నారు. ఇటీవల బ్లాక్ భాస్టర్ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిపుల్ల’, ‘చుట్టమల్లే’, ‘గిర గిర గిర’వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లు, మెంటర్లు డాన్స్ చేసి అలరించ నున్నారు..కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్ గా ఆట టైటిల్ పోరులోదిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, భావోbద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు వేదికగా ప్రసారం కానుంది.

