Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeసినిమారైతుల ప్రభుత్వం తెదేపాదే : రత్నాపల్లి ఆనంద్ యాదవ్

రైతుల ప్రభుత్వం తెదేపాదే : రత్నాపల్లి ఆనంద్ యాదవ్

📰 Generate e-Paper Clip

రైతుల ప్రభుత్వం తెదేపాదే : రత్నాపల్లి ఆనంద్ యాదవ్

 

వెల్దుర్తి, ఫిబ్రవరి 02, (రిపోర్టర్ నూర్ బాష), (సీమకిరణం న్యూస్) :

తెదేపా ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని తెదేపా నాయకులు రత్నాపల్లి ఆనంద్ యాదవ్ అన్నారు. బ్రహ్మగుండం రహదారిలోని ఎర్రచెరువులో ఉన్న సారవంతమైన మట్టిని రైతులు సోమవారం స్వచ్ఛందంగా తమ పొలాలకు ట్రాక్టర్ల ద్వారా తరలించుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆనంద్ యాదవ్, తెదేపా నాయకులు వెంకటేశ్వర్లు, గోపాల్, యల్లయ్య తదితరులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పొలాల్లో సారవంతమైన మట్టిని తరలించేందుకు పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంబాబు అధికారులతో చర్చించి అవసరమైన అనుమతులు ఇప్పించారని తెలిపారు.ఎర్రచెరువు మట్టిని పొలాలకు తీసుకెళ్లడం వల్ల పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంబాబు గారికి తెదేపా నాయకులు, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular