Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeస్పోర్ట్స్ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

 

కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) :

 

ఈ నెల 7వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగోట్ల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నిర్వహించనున్న రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్, రోడ్డు మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, శానిటేషన్, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాఖల మధ్య సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , ఎమ్మిగనూరు శాసనసభ్యులు , ఆర్డిఓ అజయ్ కుమార్ , జెడ్.పి సీఈఓ నాసర రెడ్డి ,ఆర్ డి ఓ సందీప్ కుమార్ , సి పి ఓ భారతి , ఆర్ అండ్ బి ఎస్.ఇ. మహేశ్వర్ రెడ్డి , ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్.ఇ మనోహర్ , డి పి ఓ భాస్కర్ , డిఎస్ఓ రాజా రఘువీర్ ,డి ఎం సివిల్ సప్లై వెంకట రాముడు , డిఎంహెచ్వో భాస్కర్ , డి సి హెచ్ ఎస్ జఫరుల్లా , మున్సిపల్ కమిషనర్ గంగి రెడ్డి , ఏ డీ సర్వే ముణికన్నన్ , జేడీ అగ్రికల్చర్ వరలక్ష్మి , ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహ ,ఇంచార్జ్ డ్వామా పి.డి మాధవి లత , డి ఆర్ డి ఏ పి.డి రమణా రెడ్డి , మెప్మా పి డి శ్రీనివాసులు , ఏ పి ఎం ఐ పి పిడి సుధాకర్ , తహసీల్దార్ శ్రీనివాసులు , మొదలగు వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular