Tuesday, November 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. రమాకాంత్ రెడ్డి హామీ

ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. రమాకాంత్ రెడ్డి హామీ

📰 Generate e-Paper Clip

ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. రమాకాంత్ రెడ్డి హామీ

 

కబరస్తాన్‌కు రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తా.. గెలిచినా ఓడినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా

 

జామియా మసీదు వద్ద ఆత్మీయ సమావేశం.. ఒక్క అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి విజ్ఞప్తి

 

కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, నవంబర్ 20 (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రమాకాంత్ రెడ్డి ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, గ్రామ అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వెల్దుర్తిలోని జామియా మసీదు వద్ద ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకుంటూ రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గతంలో తమ తండ్రి హయాంలో కబరస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, పనులు పూర్తయ్యాయని, షాదీఖానా నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే అనంతరం చాలా కాలంగా ఆశించిన అభివృద్ధి పనులు జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కబరస్తాన్ వద్ద రహదారి, వీధి దీపాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేవని గుర్తించామని, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ముస్లిం సోదరుల సౌకర్యార్థం కబరస్తాన్‌కు రోడ్డు వేయించి, వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తాను మొదటిసారి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నానని, గత 40–50 ఏళ్లుగా గ్రామంలో ఎవరు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజలతో కలిసి ఉంటూ, వారి బిడ్డగా భావించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక నాయకులు, యువకులు సైతం మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువ అభ్యర్థికి ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. అభ్యర్థి ఇచ్చిన హామీల అమలును ఐదేళ్ల తర్వాత ప్రశ్నించే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉంటుందని పేర్కొంటూ, గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular