22న ఉదయం నామినేషన్ దాఖలు.. ప్రజల ఆశీస్సులు కోరిన అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి
కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, నవంబర్ 20 (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైకాపా మండల కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఈ నెల 22వ తేదీ ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్దుర్తి గ్రామ ప్రజలను ఉద్దేశించి తనకు ఆశీస్సులు అందించి, సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. “మన ఊరు.. మన వెల్దుర్తి.. గ్రామ అభివృద్ధే మన లక్ష్యం” అనే నినాదంతో గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తనకు మద్దతుగా నిలవాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి కోరారు.

