Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ విడుదల

పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ విడుదల

📰 Generate e-Paper Clip

పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ విడుదల

 

 

ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ

 

 

29న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

 

 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట

 

 

అమరావతి, నవంబర్ 16, (సీమకిరణం న్యూస్):

 

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 21న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నవంబర్ 22న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 23న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. నవంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. నవంబర్ 30న అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.కాగా, రెండో దశ ఎన్నికల షెడ్యూల్‌లో విశాఖపట్నం జిల్లాకు చోటు కల్పించలేదు. మూడో దశలో ఆ జిల్లాలోని నాలుగు మండలాలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular