Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం!

యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం!

📰 Generate e-Paper Clip

యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం!

 

వెల్దుర్తి శివార్లలో పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న సంకల్పం

 

ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి వంశీధర్

 

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఘన సన్మానం

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి వంశీధర్ అన్నారు. గ్రామ శివార్లలో ఒక మంచి పరిశ్రమను ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పం ఉందని వెల్లడించారు. శనివారం వెల్దుర్తికి వచ్చిన ఆయన స్థానిక జర్నలిస్టు కాలనీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు యార్లపాటి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ అభివృద్ధికి ఆయన అందించిన సహాయ సహకారాలను గుర్తించి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

 

గ్రామం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదగడం గర్వకారణం

 

వెల్దుర్తి గ్రామం నుంచి పారిశ్రామిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రభుత్వంతో సైతం ఎంఓయూ చేసుకునే స్థాయికి చేరుకోవడం గ్రామానికి గర్వకారణమని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములు సైతం తిరువీధి వంశీధర్‌ను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు అందించారు.

 

యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా

 

ఈ సందర్భంగా పాత్రికేయులతో తిరువీధి వంశీధర్ మాట్లాడుతూ.. వెల్దుర్తి గ్రామంలోని దేవుళ్ల ఆశీస్సులు, పెద్దల ఆశీర్వాదాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తాను పుట్టి పెరిగిన గ్రామానికి ఏదైనా చేయాలనే సంకల్పం ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. ఈ దిశగా వెల్దుర్తి పట్టణ శివార్లలో అనువైన ప్రాంతంలో ఒక మంచి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాలనేది తన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటు యువతకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి సుధీంద్ర, ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్ రెడ్డి, గోపీనాథ్ నాయుడు, చిరంజీవి, మధు, గురుస్వాములు గౌండసూరి, చిరంజీవి, బోయ భాస్కర్ నాయుడు, రత్నపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular