Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములకు అన్నదాన సేవ!

ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములకు అన్నదాన సేవ!

📰 Generate e-Paper Clip

అన్నదాన కార్యక్రమానికి పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి సహకారం

 

స్వాములకు స్వయంగా భోజనం వడ్డించిన పారిశ్రామికవేత్తలు

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్):

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అన్నదాన సేవలకు తమవంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. వెల్దుర్తి పట్టణంలోని పసులోని దేవాలయంలో ఆంజనేయ స్వామి మాలాధారణ చేపట్టిన స్వాములకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వెల్దుర్తికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి తనవంతు సహకారం అందించారు. శనివారం దేవాలయానికి చేరుకున్న తిరువీధి రమేష్ శెట్టికి ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు తిరువీధి వంశీధర్, తిరువీధి సుధీంద్ర, తిరువీధి రాంప్రసాద్‌లను కూడా స్వాములు ఘనంగా సత్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తిరువీధి రమేష్ శెట్టి, ఆయనతో పాటు వచ్చిన పారిశ్రామికవేత్తలు స్వయంగా మాలాధారణ స్వాములకు భోజనం వడ్డించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వాములకు సేవ చేయడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అన్నదాన సేవలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి గురుస్వాములు వెంకటేశు, బాలు, అభితేజ గౌడ్, ఫోటో స్టూడియో వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular