Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్వెల్దుర్తిలో సురక్షితంగా దొరికిన మిస్సింగ్ బాలుడు.. పోలీసులకు కృతజ్ఞతలు!

వెల్దుర్తిలో సురక్షితంగా దొరికిన మిస్సింగ్ బాలుడు.. పోలీసులకు కృతజ్ఞతలు!

📰 Generate e-Paper Clip

వెల్దుర్తి పోలీసుల చొరవతో బాలుడి ఆచూకీ గుర్తింపు

 

సమయస్ఫూర్తితో వ్యవహరించిన వెల్దుర్తి పోలీసులు..

 

క్షేమంగా దొరికిన 13 ఏళ్ల బాలుడు.

 

వెల్దుర్తి పోలీసుల చొరవకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

 

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 9 (సీమకిరణం న్యూస్):

 

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీపల్లె గ్రామానికి చెందిన మిస్సింగ్ బాలుడు బోయ జగన్ మోహన్ అలియాస్ చింటూ (13) క్షేమంగా లభ్యమయ్యాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మీపల్లె గ్రామానికి చెందిన పెద్ద అయ్యస్వామి కుమారుడు బోయ జగన్ మోహన్ అలియాస్ చింటూ నవంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో గోవర్ధనగిరి గ్రామానికి హెయిర్ కటింగ్ చేయించుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెల్దుర్తి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన వెల్దుర్తి పోలీసులు బాలుడి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. పోలీసుల కృషి, చొరవతో బాలుడు క్షేమంగా లభించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలుడిని గుర్తించి క్షేమంగా తిరిగి అప్పగించడంలో చొరవ చూపిన వెల్దుర్తి పోలీసులకు బాలుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సమయస్ఫూర్తి, సహకారం పట్ల వారు అభినందనలు వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular