డిప్లొమా కోర్సులకు నేడు రెండో విడత కౌన్సెలింగ్
మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక చర్యలు.. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి
కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ
కర్నూలు వైద్యం, నవంబర్ 09, (సీమకిరణం న్యూస్):
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ (డిప్లొమా ఇన్ పారామెడికల్) కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మంగళవారం (నవంబర్ 10) రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, కళాశాల ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లతో పాటు, ఇప్పటికే అడ్మిషన్ పొందిన అభ్యర్థులు ఇతర కోర్సుల్లో చేరడం వల్ల ఖాళీ అయ్యే సీట్లను కూడా రెండో విడతలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని డాక్టర్ కె. చిట్టి నరసమ్మ సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

