సాప్ట్‌వేర్ ఫుల్‌టైం.. సైబర్ క్రైమ్ పార్ట్‌టైం
సైబర్ మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కిన సాప్ట్‌వేర్ ఇంజినీర్
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ తక్కువ వడ్డీకే ఆన్‌లైన్ లోన్ అనే యాడ్‌ను క్లిక్ చేసిన ఆదిలాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్
దీంతో వెంటనే ప్రవీణ్‌కు వాట్సాప్ కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ఈఎంఐ, సర్వీస్ చార్జీలు అంటూ ముందే రూ.17,951 నొక్కేసిన సైబర్ నేరగాళ్లు
తర్వాత రుణం మంజూరు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రవీణ్ దర్యాప్తు చేపట్టి ప్రవీణ్ లాంటి బాధితులు ఇంకా 30 మంది ఉన్నారని, నిందితులు హైదరాబాద్ – ముషీరాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి తలారి ఆకాష్‌తో పాటు మరో నలుగురిని గుర్తించిన పోలీసులు… ఆకాష్ అరెస్ట్ కాగా పరారీలో ఉన్న మిగతా నలుగురు కోసం గాలింపు.

