Monday, September 21, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తా

జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తా

📰 Generate e-Paper Clip

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా

 

కర్నూలు జిల్లా ఇన్‌చార్జి సయ్యద్ షోయబ్ ఖాద్రి

 

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కర్నూలు జిల్లా ఇన్‌చార్జిగా సయ్యద్ షోయబ్ ఖాద్రి నియామకం

 

కర్నూలు ప్రతినిధి, జూలై 04, (సీమకిరణం న్యూస్) :

 

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జిగా సయ్యద్ షోయబ్ ఖాద్రిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ షోయబ్ ఖాద్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి, సభ్యత్వ విస్తరణకు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ షోయబ్ ఖాద్రి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular