పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా
కర్నూలు జిల్లా ఇన్‌చార్జి సయ్యద్ షోయబ్ ఖాద్రి
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కర్నూలు జిల్లా ఇన్‌చార్జిగా సయ్యద్ షోయబ్ ఖాద్రి నియామకం
కర్నూలు ప్రతినిధి, జూలై 04, (సీమకిరణం న్యూస్) :
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జిగా సయ్యద్ షోయబ్ ఖాద్రిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ షోయబ్ ఖాద్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి, సభ్యత్వ విస్తరణకు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ షోయబ్ ఖాద్రి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.