Saturday, May 9, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్...

తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ | నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు మరియు మేము ఇరాన్‌లో మరియు లెబనాన్‌లో సమ్మెను తీవ్రతరం చేస్తూనే ఉన్నామని చెప్పారు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక సంధి ప్రకటన తర్వాత పశ్చిమాసియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ స్టేట్ మెంట్ ను లెక్క చేయట్లేదు ఇజ్రాయెల్. ఇరాన్‌పై తన దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌తో మాట్లాడారు. ఇరాన్ సహా లెబనాన్ పైనా తమ దాడులు సాగిస్తోన్నట్లు వివరించారు.

పశ్చిమాసియా రీజియన్ లో ఉద్రిక్తతను తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన పరిష్కారాన్ని సూచించిన అనంతరం తాజా పరిణామాలు సంభవించాయి. తమ సైనిక చర్యలను కొనసాగిస్తామని నెతన్యాహు తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు ఇరాన్‌లో చురుగ్గా కదులుతున్నాయని, తమ లక్ష్యాలు నెరవేరే వరకు ఈ కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ట్రంప్ కూ తేల్చి చెప్పారు.

నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు మరియు మేము ఇరాన్‌లో మరియు లెబనాన్‌లో సమ్మెను తీవ్రతరం చేస్తూనే ఉన్నామని చెప్పారు

ట్రంప్‌ తో మాట్లాడినట్లు నెతన్యాహు ఫోన్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన విషయాలను ఆయన పోస్ట్ చేశారు. తమ సైనిక చర్యలు ఇంకా ముగియలేదని, ఇరాన్‌ ఒక్కటే కాకుండా లెబనాన్‌తో సహా ఈ సంఘర్షణకు సంబంధించిన ఇతర సరిహద్దు ప్రాంతాలలో కూడా తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరిక.

డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడానని, వైఎస్ సైన్యంతో ఇజ్రాయెల్ కొన్ని అద్భుత విజయాలను సాధించిందని నెతన్యాహు పేర్కొన్నారు. వీటిని ఉపయోగించుకొని రెండు దేశాల కీలక ప్రయోజనాలను కాపాడే ఒప్పందంలో భాగంగా యుద్ధ లక్ష్యాలను సాధించడానికి ఒక అవకాశం ఉందని ట్రంప్ నమ్ముతున్నారు. అదే సమయంలో తాము ఇరాన్, లెబనాన్ కూడా దాడులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

ఇరాన్ కు చెందిన అన్ని రకాల క్షిపణి, అణు కార్యక్రమాలను తుడిచి వేస్తోన్నామని నెతన్యాహు తెలిపారు. లెబనాన్‌లో హిజ్బుల్లాపై అతి తీవ్రమైన దాడులను కొనసాగిస్తున్నామని వివరించారు. కొద్ది రోజుల కిందటే తాము మరో ఇద్దరు అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టినట్లు ప్రకటించారాయన. అక్కడితో తమ దాడులు ఆగిపోవట్లేదని, ఏ సందర్భంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ ప్రయోజనాలను కాపాడుకుంటామని అన్నారు. ఈ వ్యాఖ్యలతో యుద్ధ తీవ్రతను మరింత పెంచే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular