Sunday, March 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఈ నెల 28న బుక్కాపురం గ్రామానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక

ఈ నెల 28న బుక్కాపురం గ్రామానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక

📰 Generate e-Paper Clip

ఈ నెల 28న బుక్కాపురం గ్రామానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక

 

28 న జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి : ఎమ్మార్పీఎస్

 

 

28న జరగబోయే కార్యక్రమం కరపత్రాల విడుదల

 

బుక్కపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ

 

 వెల్దుర్తి, మార్చి 22, (సీమకిరణం న్యూస్) :

 

వెల్దుర్తి మండలంలోని బుక్కపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ విచ్చేయుచున్న సందర్భంగా వెల్దుర్తి స్థానిక కార్యాలయం నందు కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ మాజీ మండలాధ్యక్షుడు నాయకంటి గిడ్డయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా జిల్లా ఇన్చార్జి దుమ్ము వెంకటేశ్వర్లు (చిన్న) మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సేవలు మరువలేనివని వారు గుర్తు చేశారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ వెల్దుర్తి మండలానికి వస్తున్న సందర్భంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, గ్రామస్థాయిలో ప్రతి గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొనీ ఆయనకు ప్రతి గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాసపోగు బజారు మాదిగ, గిడ్డయ్య మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు దేవదానం మాదిగ,జె.బజారు మాదిగ, మోష మాదిగ, సూరిబాబు మాదిగ, రాంబాబు మాదిగ, వెంకట్రాముడు మాదిగ,శివన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular