Sunday, March 22, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! | తెలంగాణ సీఎం రేవంత్...

రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలపై రైతులకు ఆసక్తికర ట్వీట్ చేశారు

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నారు. నేడు రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నప్పటికీ ఆదివారం కావడంతో ఆ నిధులు రేపు రైతుల ఖాతాల్లోకి వస్తాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నిధులను సీఎం విడుదల చేశారు.

రైతు భరోసాపై సీఎం రేవంత్ ట్వీట్

ఈ వీడియో ముందే సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక సందేశాన్ని పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాతల కోసం అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పిన రేవంత్ రెడ్డి రైతు ధైర్యంగా సాగు మడిలో నిలబడేందుకు భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలపై రైతులకు ఆసక్తికర ట్వీట్ చేశారు

రైతే రాజు అని రుజువు చేస్తూ పథకం అమలు

అలాగే రాష్ట్రంలో 70 లక్షల మంది రైతన్నల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేసిన ఆయన, సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన

కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసి, నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాము. దీనికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాల తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు మహోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

రైతు మహోత్సవం స్టాల్స్ సందర్శించనున్న సీఎం రేవంత్

వ్యవసాయానికి సంబంధించి, దాని అనుబంధ రంగాలకు సంబంధించి 150 స్టాల్స్ ను ఆయన సందర్శిస్తారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పే ప్రయత్నాన్ని మరోమారు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా చెప్పారు. గత ఏడాదిగా రైతు భరోసా కోసం అవసరమైన రైతులకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి భరోసా ఇచ్చారు. రైతన్నకు అండదండగా నిలబడడానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular