తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్సిటీలో నవంబర్, 2024 నుంచి కేవలం 920 మంది విద్యార్థులు మాత్రమే శిక్షణ కోసం పేరు నమోదు చేసుకున్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తోందని పేర్కొంది.
మార్చి 20, 2026 నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య 68,680గా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కల్ని ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో తప్పుడు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ వెబ్ సైట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 21, 2026 నాటికి వెబ్‌సైట్‌లో 1000 మంది విద్యార్థులు అలాగే 68,935 మంది విద్యార్థులు లెర్నర్‌లను సందర్శించినట్లు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YISU)ప్రచురిస్తోంది.
ఇదే విషయంపై తెలంగాణ జాగృతి నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి విశ్వాసం, సమగ్రతతో పనిచేయాలని వివరించింది. వెబ్‌సైట్‌లలో తప్పుడు లెక్కలతో కోట్ల మంది ప్రజలు తప్పుదారి పట్టించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇలాంటి విషయాల్లో తెలంగాణ జాగృతి ప్రజల పోరాటం చేస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.

అలాగే రాష్ట్రంలో కేవలం 13వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని కవిత ధ్వజమెత్తారు. తాము ప్రజా బడ్జెట్ లో లేవనెత్తిన కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో పెట్టలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. బడ్జెట్ లో కేటాయింపులు చేయకున్నా.. అవకాశం దక్కని రంగాలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ప్రాధాన్యత ఇవ్వచ్చని డిమాండ్ చేశారు.
-

ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!
-

డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత
-

జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ – మారుతున్న లెక్కలు..!!
-

టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!!
-

కవిత కొత్త పార్టీ ఏర్పాటు వేళ బిగ్ ట్విస్ట్, నెక్స్ట్ ఇక – నియోజకవర్గం ఫిక్స్..!!
-

రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు
-

చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే!
-

ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు..
-

వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
-

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి
-

వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!
-

చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!













