భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
నిశ్శబ్దంగా ఉన్న అడవి.. చుట్టూ పచ్చని చెట్లు.. ఆ ప్రకృతి ఒడిలో ఏనుగుల కుటుంబం గాఢ నిద్రలో ఉంది. ఒక చిన్ని ఏనుగు పిల్ల తన రక్షణ కోసం, ప్రేమ కోసం తన కాలును పెద్ద ఏనుగుపై వేసి హాయిగా నిద్రపోతోంది. చూస్తే ప్రతి కంటిని తడిమే ఈ అద్భుత దృశ్యం తమిళనాడులోని ఆనమలై టైగర్ రిజర్వ్‌లో ఆవిష్కృతమైంది. ప్రకృతి అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్) సందర్భంగా తమిళనాడు శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియ సాహు పంచుకున్న ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది.
మనుషుల లాగే ఏనుగుల ప్రపంచంలో కూడా కుటుంబమే సర్వస్వం. ప్రేమ, భద్రత, ఆప్యాయత అనే బంధాలు వాటి మధ్య ఎంత బలంగా ఉంటాయో ఈ చిత్రం నిరూపిస్తోంది. ఆ ఏనుగు పిల్ల తన పెద్దల మీద కాలు వేసి పడుకోవడం కేవలం నిద్ర కోసం కాదు, తన వెనుక ఒక కొండంత అండ ఉందనే నమ్మకం కోసం. ఈ నిశ్శబ్ద అడవి వాటికి ఒక ఊయలలా మారి, ప్రాణకోటిని తన గుండెల్లో దాచుకుంటుంది. ధను పరణ్ అనే ఫోటోగ్రాఫర్ తన లెన్స్‌లో బంధించిన ఈ క్షణం, అడవి యొక్క శాశ్వతత్వాన్ని, దాని రక్షకత్వాన్ని ప్రతిబింబిస్తోంది.

అడవి లేకపోతే ఏముంది?
“అడవులు లేకపోతే ఏదీ ఉండదు.. ఏది మిగలదు” అనే పచ్చి నిజాన్ని ఈ ఫోటో మనకు గుర్తు చేస్తుంది. కేవలం ఏనుగులకే కాదు.. వన్యప్రాణులకు, నదులకు, చివరికి మానవ మనుగడకు అడవులే జీవనాధారం. అడవులు అంతరిస్తే ఈ ప్రపంచం నిరుపేదగా, కఠినంగా, శూన్యంగా మారిపోతుంది. అడవి తల్లి రక్షణలో ఉన్నప్పుడే జీవ వైవిధ్యం వికసిస్తుందని, దాన్ని చేసుకోవడం మనందరి బాధ్యతని ఈ సందర్భం హెచ్చరిస్తోంది.
ప్రకృతి ఒడిలో ఒక అపురూప కావ్యం
అంతర్జాతీయ దినోత్సవం వేళ, ఈ దృశ్యం కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు.. ప్రకృతి మనకు ఇస్తున్న ఒక సందేశం. మనం అడవిని కాపాడితే, అది మనల్ని ఒక తల్లిలా, ఒక ఊయలలా కాపాడుతుందనడానికి ఈ ఏనుగుల కుటుంబమే నిదర్శనం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేలాది మందిని ఆకర్షించిన ఈ చిత్రం, అడవి లేనిదే జీవితం లేదనే సత్యాన్ని చాటిచెబుతోంది.
తమిళనాడులోని అనమలై టైగర్ రిజర్వ్‌లో ఒక అందమైన ఏనుగు కుటుంబం గాఢంగా నిద్రపోతోంది, ఈ అసాధారణ దృశ్యం కెమెరాలో బంధించబడింది. ఆ యువకుడు ఓదార్పు, భద్రత మరియు ప్రేమను కోరుతూ పెద్దవారిపై మెల్లగా తన కాలును ఆశ్రయిస్తాడు. ఏనుగుల ప్రపంచంలో కుటుంబమే సర్వస్వం. మరియు చుట్టూ… pic.twitter.com/d2AhHNhqeO
— సుప్రియా సాహు IAS (@supriyasahuias) మార్చి 21, 2026

