Saturday, March 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరైతు భరోసా నిధుల విడుదల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన ..!! | సిద్దిపేట జిల్లా...

రైతు భరోసా నిధుల విడుదల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన ..!! | సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

రైతు భరోసా నిధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సంక్రాంతి సమయంలోనే ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 22న విడుదల కానున్నాయి. అయితే, ఇంతకుముందు నిధులు జమ అయిన వారందరికీ ఈ సారి కూడా నిధులు అందజేయాలని ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇదే సమయంలో జమ విధానం పైన స్పష్టత ఇచ్చింది.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయించింది. రేపు (ఆదివారం) సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. అయితే, రబీ సీజన్‌ బ్యాంక్‌కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఆదివారం రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. రేపు మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ. మూడు విడతల్లో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నా… ఎకరం వరకు తొలి విడతలోనే అందరు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

సిద్దిపేట జిల్లాలో నార్మెట్ట నుంచి పంపిణీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ

కాగా, 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడవ విడత నిధులు రూ. 9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో ‘రైతు భరోసా’ను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు విడతల్లోనే ఈ సారి నగదు జమ చేసే ప్రక్రియ పూర్తి. కాగా.. రైతు భరోసా కొత్త దరఖాస్తులను కూడా అర్హుల నుంచి ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 2026లో కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలు, రైతు విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular