ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ కార్డులు… రేషన్ పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. రేషన్ కోసం స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. అదే సమయంలో రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇందు కోసం వేళలను అమలు చేస్తోంది. షాపుల వద్దకు రాలేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డుల జారీ… మార్పులకు సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సులువుగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో పాటుగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా వివరాలు మార్చుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి ఉంది. సచివాలయాల్లో సిబ్బంది ఉండటం వల్ల రేషన్ సేవలు పొందే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి చెక్ పెడుతూ సేవలను సులభతరం చేస్తూ ప్రభుత్వం తాజాగా మార్పులు తెచ్చింది. దీంతో ఇక నుంచి ఈ సేవల వార్డు సచివాలయాల్లోనే కాకుండా మీ సేవ పోర్టల్ ద్వారా రేషన్ కార్డు సేవలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందవచ్చు. తొమ్మిది రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

రేషన్ సేవలను సులభతరం చేస్తూ
ఈ విధానం ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా సభ్యులను తొలగించడం, కొత్త సభ్యులను చేర్చుకోవడం, కార్డు విభజన చేయడం, కార్డు స్వాధీనం, కార్డుల వివరాల అప్‌డేట్, ఆధార్ లింక్, డూప్లికెట్ కార్డు, రేషన్ షాపుల వివరాలను అప్‌డేట్ చేయడం ద్వారా మీ సేవ కేంద్రాల ద్వారా ఏపీ ప్రజలు సులువుగా పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇక అయితే పలు నిర్ధారణ, ధృవీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాగా.. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు జిరాకులు, ఫొటోలను అందించాలి. అదే విధంగా రేషన్ కార్డు వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇక ఒక అడ్రస్ మార్పులు, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన పూర్తి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ఎలాంటి అనుమతి నిర్దేశించలేదు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

