Wednesday, March 18, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు..!!

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు..!!

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు..!!

 

షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular