Wednesday, March 18, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవెలుగుమట్ల బాధితుల కోసం కవిత మరో షాకింగ్ స్టెప్.. తగ్గేదెలే! | వెలుగుమట్ల బాధితులకు షాకింగ్...

వెలుగుమట్ల బాధితుల కోసం కవిత మరో షాకింగ్ స్టెప్.. తగ్గేదెలే! | వెలుగుమట్ల బాధితులకు షాకింగ్ స్టెప్.. న్యాయం జరిగేలా నిజనిర్ధారణ కమిటీని ప్రకటించిన కవిత

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

వెలుగు మట్లలో సామాన్య నిరుపేదల పక్షాన కవిత తన పోరాటాన్ని ఆపలేదు. తాజాగా బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీచేసి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ మేయర్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులతో కమిటీ వేసినట్టు కవిత పేర్కొన్నారు.

వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ

బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రొఫెసర్ కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు వెలుగుమట్ల లో జరిగిన ఘటన పైన స్పందించాలన్నారు కవిత. నిజ నిర్ధారణ కమిటీని వెలుగుమట్లలో ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహరించిందో అక్కడకు వెళ్లి పరిశీలించాలన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి పేదవారికి న్యాయం జరిగేలా విజ్ఞప్తి చేశారు.

వెలుగుమట్ల బాధితుల కోసం కవిత షాకింగ్ స్టెప్, న్యాయం జరిగేలా నిజనిర్ధారణ కమిటీని ప్రకటించింది

వాళ్ళ మనుగడ ప్రభుత్వ బాధ్యతనిదే

తాము ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నారు. బాధితుల ఇళ్లు పూర్తయ్యే వరకు వారికి మనుగడకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వెలుగుమట్లలో ఎటువంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా పేదలకు సంబంధించిన 750 మంది ఇళ్ళను కూల్చేసి ఉన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాపోరాటాలకు గెలుపు ఉంటుంది

ధర్మసమాజ్ పార్టీ, జాగృతి ఈ అన్యాయంపై చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చింది. కూల్చిన చోటే 350 మందికి పట్టాలు ఇస్తామని, మరో 110 మందికి గ్రామాల్లో ఇళ్లు కట్టేందుకు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాపోరాటాలకు గెలుపు ఉంటుందన్నారు. అయితే 750 మంది ఇళ్లను కూల్చేసి, 460 మందికి మాత్రమే ఇళ్లు ఉన్నాయి.

సంపూర్ణ న్యాయం జరిగేవరకు పోరాటం

ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదన్నది స్పష్టంగా తెలిసిపోయింది. జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ప్రజాపోరాటాలకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ సంపూర్ణ న్యాయం జరగలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కవిత డిసెంబర్ 9 నాటికి వాళ్ల ఇళ్లను పూర్తి చేసినట్లు చెప్పారు. కానీ అప్పటివరకు ఆ పేదలు ఎక్కడ ఉండాలి? అని ప్రశ్నించారు. వాళ్ల ఇంటి అద్దె, పిల్లలకు కావాల్సిన సాయం ప్రభుత్వమే చేయాలన్నారు.

మేధావుల మౌనం సమాజానికి నష్టం

మేధావుల మౌనం సమాజానికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. దయచేసి కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వారు స్పందించాలన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు కవిత. ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ వాస్తవాలను తెలుసుకోవడానికి ఖమ్మం పంపించారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular